అన్నక్యాంటీన్లకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం…

లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) నేటి నుండి ప్రారంభం కానున్న అన్నక్యాంటీన్లకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  ఈ సంస్థ అధినేత విజయవాడకు చెందిన పెనుమత్స శ్రీనివాసరాజు  సచివాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కును ఇవ్వడమే కాకుండా రాబోయే ఐదేళ్ల పాటు ఇంతే మొత్తం లో విరాళం అందిస్తానని తెలపడం హర్షణీయమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. పేద వాడికి అన్నంపెట్టే మంచి కార్యక్రమం మళ్ళీ ప్రారంభిస్తున్నామని తెలిసి అన్ని వర్గాల వారూ అందులో భాగస్వాములు అవుతుండడం ఆనందంగా ఉందన్నారు. తమకు ఉన్నదాంట్లో కొంత సమాజం కోసం ఖర్చు చేయాలనే వారి ఆలోచనలు అందరికీ స్ఫూర్తి దాయకమన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *