తణుకు ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…ముఖ్య అతిధిగా పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ….

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తణుకులో ఘనంగా నిర్వహించారు. ముందుగా తణుకు మున్సిపల్  కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ  జాతీయ పతాక ఆవిష్కరణ చేసి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దాదాపు రెండు శతాబ్దాల బ్రిటీష్ వారి పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజుకి గుర్తుగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని భారతదేశం గత పోరాటాలను గౌరవించే బహుముఖ వేడుక ఇది అన్నారు. గత విజయాలను గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తు ఆకాంక్షల కోసం ఎదురుచూస్తూ జాతీయ స్వేచ్చ, స్ఫూర్తిని గుర్తు చేస్తూ.. పౌరులందరికీ మెరుగైన దేశాన్ని నిర్మించడానికి కొనసాగుతున్న తపనను ప్రతిబింబించే రోజు గా అభివర్ణించారు. అనంతరం తణుకు మండల తహసీల్దార్ కార్యాలయంలో, తణుకు పట్టణం జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో, అత్తిలి మండల తహసీల్దార్ వారి కార్యాలయంలో, ఇరగవరం మండలం తహసీల్దార్ కార్యాలయంలో, తణుకు పట్టణం ఉమ్మడి పార్టీ కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పించి విద్యార్థులను ఉద్దేశించి ప్రశంగించారు. తదుపరి వివిధ ప్రదేశాలలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *