లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) స్థానిక రూట్స్ పాఠశాలలో భారత 78వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు చాలా ఉత్సహంగా, దేశ భక్తిని పెంపోందించేలా ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ LK త్రిపాఠీ తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రిన్సిపాల్ త్రిపాఠీ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ విశిష్టత వివరించారు. మన దేశ నాయకుల త్యాగ ఫలితంగా సాధించిన ఈ స్వాతంత్య్రం చాలా ప్రత్యేకమని, సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగఫలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం, మన ఈ 77సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవం సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకొని భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మికమైనది రోజు ఇది అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మన నాయకులు ఎంత పోరాట పటిమతో ఆంగ్లెయుల పాలన అడ్డుకున్నారో తెలియజేశారు. అనంతరం విద్యార్థి, విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని చూపరులను అలరించారు. ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొని తమ దేశ భక్తిని చాటారు. గత సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 590 మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచిన పి. సుమేదాసు సాలువ, పుష్ప గుచ్చంతో సత్కరించి 20,000/- నగదు బహుమతి, మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ లు, N సుధాకర్ వర్మ, LK త్రిపాఠీ, B. విద్యాకాంత్, పురభి, ప్రైమరి క్యాంపస్ ప్రిన్సిపాల్ T. సంధ్య, D. పద్మజ, vm మాధురి, E. సుబ్బలక్ష్మి, S. మాధురి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రూట్స్ స్కూల్ నందు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
15
Aug