లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం) ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన భారతావనిలో నేటికీ నిరుద్యోగం, పేదరికం, దారిద్ర్యం తాండవించడం శోచనీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆవేదన వ్యక్తం చేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను భీమవరం శ్రీనివాసా సెంటర్లో సీపీఐ స్థూపం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం కోనాల మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్ర్య కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని పేదరికం , దారిద్ర్యం, నిరుద్యోం లేని సుసంపన్నమైన దేశాన్ని వారు కాక్షించారని వారు కన్న కలలు నేటికీ నెరవేరకపోవడం దారుణమన్నారు. స్వాతంత్ర్య ఫలాలు అందాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం కావాలని, విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం ప్రాధమిక హక్కు కావాలని కోనాల డిమాండ్ చేశారు. నేటి భారతావనిలో పాలకులు సంకుచితత్వంతో భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడ్తున్నారని, లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, స్వాతంత్ర్య సమర యోధుల స్పూర్తితో స్వాతంత్ర్యాన్ని పరిరక్షించేందుకోవాలని, అమర వీరుల ఆశయ సాధనకు పునరంకితం కావాలని కోనాల పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాసరావు, కిలారి మల్లేశ్వరావు,భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అల్లూరి వర్మ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
స్వరాజ్యం సిద్ధించి 78 ఏళ్ళయినా సమరయోధుల ఆశయాలు నెరవేరకపోవడం శోచనీయం *సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు…
15
Aug