లీడర్ భాస్కర్ న్యూస్ (మండపేట) మండపేట 3 వ సచివాలయం అడ్మిన్ గా పనిచేస్తున్న గుణ్ణం శ్రీ సత్య హరిక జిల్లా ఉత్తమ అవార్డు అందుకున్నారు. జిల్లా కేంద్రం అమలాపురం లో కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్, మంత్రి వాసం శెట్టి సుభాష్ లు ఆమె కు అవార్డు అందజేశారు. ప్రజలకు నిత్యం అందుబాటు లో ఉంటూ సేవే లక్ష్యం గా పనిచేసే అధికారిగా ఆమె గుర్తింపు పొందారు. ఉత్తమ అవార్డు పొందిన ఆమెను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్,చైర్ పర్సన్ పతి వాడ నూక దుర్గా రాణి, మునిసిపల్ కమిషనర్ బి రాము, అడ్మిన్ లు, సచివాలయం సిబ్బంది అభినందించారు.
సచివాలయం అడ్మిన్ హరిత కు ఉత్తమ అవార్డు…
15
Aug