లీడర్ భాస్కర్ న్యూస్ (అత్తిలి) పాలూరు గ్రామంలో గల మండలం ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాల (LE) నందు పనిచేస్తూ ఉపాధ్యాయురాలు అంబటి ఫ్లోరెన్స్ గత సంవత్సరం హఠాన్మరణం చెందారు.అంబటి ఫ్లోరెన్స్ జ్ఞాపకార్థంగా చివరగా పనిచేసిన పాఠశాలకు బీరువాను ఆమె కుటుంబ సభ్యులు బహుకరించారు. బీరువాను ఆమె కుమారుడు బుడితి సుజన్ కుమార్ దంపతులు పాఠశాల సిబ్బందికి అందజేశారు.కార్యక్రమంలో పాలూరు గ్రామ సర్పంచ్ తానుకొండ దయామణి దావీదు, ఉపసర్పంచ్ రాపేటి సింహాచలం,జయరాం మరియు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.