(ఏపీ బ్యూరో లీడర్)అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ సీపీ కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా గోదావరిజిల్లాలనే టార్గెట్ చేసుకొని ఆ పార్టీ కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. సుదీర్ఘకాలం పాటు పార్టీకి విధేయులుగా ఉన్న వారి బాధ్యతలను అప్పగించాలని కార్యచరణను సిద్దం చేసింది. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షస్థానం మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్ఆర్)కు దక్కుతుందని సమాచారం. కొత్త జిల్లాలు ఏర్పాటు కాకముందు నుంచీ పదేళ్లుగా పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చురుగ్గా పనిచేశారు. నియోజకవర్గంలోనూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి చవిచూడటంతో ఏలూరు అధ్యక్షుడిగా ఉన్న ఆళ్లనాని తన పదివికి రాజీనామా చేయడంతో ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా అధ్యక్ష స్థానం ఖాళీ అయ్యాయి. దీంతో అధిష్టానం అన్ని విధాలుగా అధ్యక్షుడిగా డీఎన్నారే సమర్థుడని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. నెలాఖరులోపు ఆయన పేరు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆళ్ల నాని రాజీనామాతో ఆ పదవి కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలంనాగేశ్వరరావును వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదేళ్లుగా పార్టీలో కొనసాగుతున్న డీఎన్నార్ ప్రజలకు అందుబాటులో ఉంటూ… ప్రభుత్వ పథకాలను వారి దరి చేర్చడంలో కీలక భూమిక పోషించారు. కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని సొంత మనుషులుగా భావించి.. ఆర్థికసాయం అందించడం.. వెన్నుదన్నుగా నిలవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇటీవల జరిగిన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అపజయం ఎదురైనా కార్యకర్తలకు, శ్రేణులకు అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు. సాధారణ ఎన్నికలలో పార్టీ ఘోర ఓటమి తర్వాత వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు.. ఎంపీలుగా పోటీ చేసిన కొందరు నాయకులు ఇప్పటికే కిలారు రోశయ్య – పెండెం దొరబాబు తాజాగా ఆళ్ల నాని ఇలా ఆ పార్టీని వీడారు. ఆళ్ల నాని వైసీపీని వీడి వెళ్లిపోవడంతో ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఏలూరు అసెంబ్లీ ఇన్చార్జి పదవి కూడా ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు స్థానాలలో ఎవరు వస్తారు ? అనేదానిపై వైసీపీలో చర్చ జరుగుతుంది. ఏలూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి పార్టీ మహిళా నాయకురాలు పిల్లంగోళ్లశ్రీలక్ష్మి, పుప్పాల వాసుబాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కైకలూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నేత, మాజి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు (డిఎన్నార్)పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. డిఎన్నార్ గతంలో కైకలూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ గా పనిచేశారు. వై ఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి హోదాలో కైకలూరు వచ్చినప్పుడు కాంగ్రెస్లో చేరారు. రాజశేఖరరెడ్డి మర ణానంతరం వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ ను వీడి జగన్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గం లోనేకాక, జిల్లా స్థాయిలోను చెప్పిందే ఆ పార్టీలో అక్షర సత్యమైంది. వైసీపీలో నేతల మధ్య సమన్వయం, అంతర్గత కలహాలు తీర్చడం, పార్టీ ఆదేశాలను చక్కబెట్టడంలో ఆయనకు జగన్ వద్ద మంచి మార్కులు లభించాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో అనుకొని రీతిలో ఎమ్మెల్యే సీటు చివరి స్థాయిలో చేజారినా ఆయన పార్టీ లోనే విధేయుడిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున కై కలూరు ఎమ్మెల్యే గా ఘన విజయం సాధించారు.2024 ఎన్నికల్లో ఓటమి పాయ్యారు. పార్టీ వ్యవహారాల్లో చురుకైన పాత్ర వహిస్తూ వచ్చారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి ధైర్యం చెప్పారు. డీఎన్నార్కు ఏలూరు జిల్లాలో ఉన్న బలమైన సామాజిక వర్గంతో పాటు రాజకీయంగా మంచి పరిచయాలు ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో డీఎన్నార్, అయన ఇరువురి కుమారులు వినయ్, శ్యామ్ కుమార్ లకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే దూలం నాగేశ్వరావు కు ఏలూరు జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ దిశంగా ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా… అధ్యక్షస్థానం కోసం పెద్దగా పోటీ లేకపోవడం కూడా డిఎన్నార్కు కలిసొచ్చే అంశం కానుంది. మొత్తంగా డిఎన్నార్ వైపే అధిష్టానం మొగ్గు చూపనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే జిల్లాలో వైసీపీలో జోష్ పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
గోదావరి జిల్లాలో పట్టుకోసం వైసీపీ ఆరాటం….కొత్త అధ్యక్షల నియామకంపై పోరాటం…!
17
Aug