లీడర్ భాస్కర్ న్యూస్ (పెరవలి) పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త సాపిరెడ్డి గౌతం ఇటీవల ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అన్నవరప్పాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు పొపోప్పు సూర్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మృతుని కుటుంబానికి మంజూరైన రూ.5 లక్షల బీమా పరిహారం చెక్కును అందజేశారు. మృతుడు గౌతమ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ జనసైనికులకు అనుకోని విధంగా ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులు, మృతిచెందిన జనసైనికుల కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ పథకం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఎంతో మందికి ఇది ఉపయోగపడిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారుగా పది లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పెరవలి మండల అధ్యక్షుడు పిప్పర్ రవి, పోపోప్పు నాగేశ్వరరావు, ఆకుల సుబ్బారాయుడు, బొలిశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు.
మృతి చెందిన జనసేన క్రియాశీల సభ్యుడి కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేత..
20
Aug