పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వ వైద్యులు ముందు వరుసలో ఉండాలి… * జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి 

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) మంగళవారం తణుకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీచేసి, ప్రతీ వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా ప్రసూతి వార్డు, మందులు నిల్వ కేంద్రం, పరిపాలన, ఓపి విభాగాలు, ల్యాబ్, స్కానింగ్, ఎక్సరే యూనిట్లను పరిశీలించి సంబంధిత వైద్యులకు సూచనలు జారీ చేశారు. గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ ఆసుపత్రు నందు ప్రసవాలు ఎలా జరుగుతున్నాయి, యాంటినెంటల్ చెక్ అప్ లు బాగా జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మందుల విభాగాన్ని పరిశీలించిన సందర్భంలో ఎక్స్పైరీ డేట్ ముగిసిన మందులను సంబంధిత రిజిస్టర్ నందు నమోదు చేసి, ఆ మందులను విడిగా భద్రపరచాలన్నారు. ఎప్పటికప్పుడు మందుల ఎక్స్పైరీ డేట్ లను పరిశీలించుకోవాలని సూచించారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. ఓపి విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని, రోగులకు అందిస్తున్న సేవలను విస్తృతపరచాలని సూచించారు. అలాగే ఓపి విభాగం హాల్లో రోగులు కూర్చోవడానికి ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆసుపత్రి నందు డెలివరీలు ఎక్కువగా జరిగేలా ప్రోత్సహించడంతోపాటు, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలు ఎంతో నమ్మకంతో వైద్య సేవలకు వస్తారని, ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. అవసరమైన మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని అన్నారు. వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఎక్కువగా ఉందని నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అతిసార వ్యాధి, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏదైనా డయోరియా కేసు నమోదు అయితే వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. తాను తరచూ ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేస్తానని, వైద్య సేవల్లో లోపాలు కనిపించినా, రోగులు నుండి ఒక్క ఫిర్యాదు వచ్చినా సంబంధిత వైద్యాధి కారులను, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. విధుల యందు నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *