లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ వివిధ దళతి సంఘాలు ఇచ్చిన భారత బంద్ పిలుపునకు మద్దతు తెలుపుతూ అత్తిలిలో దళిత నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని బంద్ నిర్వహించారు.ఎస్సీ వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని, దళితులను వర్గాలుగా విభజించి తద్వారా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను తుంగలో త్రొక్కేందుకు కుట్రలు చేస్తున్నారు అని, అందులో భాగమే వర్గీకరణ ముసుగు అని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు.ముందుగా బ్యాంకులు, విద్యాసంస్థలు, వర్తకవ్యాపారస్తులు బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘణ నివాళులు అర్పించి మానవహారం నిర్వహించారు.కార్యక్రమంలో ఎస్సీ నాయకులు పొనుకు వినయ్ బాబు, బట్టు నాగరాజు, కోరుకొల్లు వెంకట్రావు,ఈడూరి రాంబాబు,రేవులగడ్డ భద్రయ్య, తేలి సుందరరావు,యాళ్ళ స్వామి స్వామి,బుడితి సుజన్ కుమార్, సబ్బితి రాజేష్, రాయుడు ధర్మారావు,ఇల్లూరి సంపతరావు,కలగపూడి అనిల్,బుంగ పద్మారావు,రాపాక నాని,మేళం విజయ ప్రభాకర్ ,ఉడుమూడి ప్రసాద్,సబ్బితి భీమన్న,మేడపాటి దినకర్,కొండే శ్రీను, యర్రబండి వెంకటేశ్వరరావు, ఉల్లంకి రాజేష్, ఈడూరి శ్యాంబాబు మరియు ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధం…
21
Aug