భూ బాధితుల రాష్ట్ర సదస్సు వాల్ పోస్టర్ ఆవిష్కరణ….

లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం)విజయవాడలో ఆగస్టు నెల 28 న సీపీఐ ఆధ్వర్యంలో జరుగనున్న భూ బాధితుల రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. భీమవరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో భూ బాధితుల రాష్ట్ర సదస్సు వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం కావడం జరిగిందన్నారు.తప్పుడు డాక్యుమెంట్ లతో బినామీలతో వైసీపీ పాలకులు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భూకబ్జా లకు పాల్పడడం జరిగిందన్నారు.ప్రజల వ్యక్తిగత ఆస్తులు, ఇళ్ళ స్థలాలు సైతం కబ్జాలకు గురికావడం జరిగిందన్నారు.ప్రజలు పోగొట్టుకున్న భూములు తిరిగి దక్కించేందుకు సీపీఐ రాష్ట్ర వ్యాపిత పోరాటాలకు సమాయత్తం చేయడంలో భాగంగా ఈనెల 28 న విజయవాడ సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో భూ బాధితుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు భీమారావు చెప్పారు.అన్యాయంగా భూములు కోల్పోయిన బాధితులు వ్యక్తిగత అర్జీలతో భూ బాధితుల రాష్ట్ర సదస్సుకు హాజరు కావాలని కోరారు.ఈసదస్సులో బాధితులు కోల్పోయిన భూములు దక్కించేందుకు పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.సదస్సు విజయవంతం చేయాలని భీమారావు కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *