* భక్తి భావంతో కృష్ణ భగవానుడికి అభిషేకం
* ప్రత్యక్ష గో పూజలో పాల్గొన్న భక్తులు
* వీనుల విందుగా భగవద్గీత గానామృతం
* అలరించిన కోలాట ప్రదర్సన
* సందడి చేసిన చిన్ని కృష్ణులు, గోపికలు
లీడర్ భాస్కర్ న్యూస్ (విశాఖపట్నం) పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహస్వామి వారి ఆదేశానుసారం, విశాఖ శ్రీ శారదా పీఠంలో కృష్ణాష్టమి వేడుకలను ఎంతో వైభవంగా, భక్తి పారవశ్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఉదయం శ్రీ కృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠ ప్రాంగణం వేద మంత్రాలతో మార్మోగి భక్తుల మనసులను పులకరింపజేసింది. పూజ అనంతరం, భక్తులు భగవద్గీత గానామృతం లో పాల్గొన్నారు. జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రత్యక్ష గో పూజ నిర్వహించారు, దీనిలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులే స్వయంగా గోమాతకు పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం శ్రీ హరిహర కోలాట బృందం, సుజాతనగర్ వారిచే నిర్వహించిన కోలాటం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అనంతరం ఉట్టి కొట్టు ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. కృష్ణుడు మరియు గోపికల వేషధారణలో చిన్నారులు పాల్గొని సందడి చేశారు. ఉత్సవాల ఆద్యంతం భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవంతో నిండి, ప్రతి కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.