*అబ్దుల్ కలామ్ హెల్త్ పార్క్ లో పర్యాటకులను ఆకర్షించే విధంగా బోటు షికారు ఏర్పాటు.
లీడర్ భాస్కర్ న్యూస్ (పాలకొల్లు) సోమవారం పాలకొల్లు డాక్టరు ఏ.పి.జె.అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ ను, కుళాయి చెరువు, యం.యల్. డి. పిల్టరేషన్ ప్లాంటును పురపాలక సంఘం అధికారులు, స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పార్కు చెరువుకు జెట్టీలు ఏర్పాటు చేసి బోటు షికారు ఏర్పాటుచేసి పర్యాటకులను మరింత ఆకర్షించే విధంగా పార్కును అభివృద్ధి చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. కుళాయి చెరువు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తాచెదారని తొలగించి, మంచినీటి చెరువును పరిశుభ్రంగా ఉంచి, పాదచారులకు ఏ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ సురక్షితమైన త్రాగునీరు తోనే ఆరోగ్యం సాధ్యమని తాగునీటి పథకానికి ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 30, 40 సంవత్సరాల క్రితం ట్యాంకు కెపాసిటీ తప్ప ప్రస్తుతం జనాభాకు అనుగుణంగా మంచినీటి సమస్యను తీర్చాలని ఉద్దేశంతో ఆనాడు రూ 15 కోట్లతో పంపులు, ఫిల్టర్ బెడ్లు, రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు పూర్తి చేశామమని, కాని అందుకు అనుగుణంగా పైపులైను విస్తరణ జరగకపోవడం వలన గంట అరగంట మాత్రమే త్రాగునీరు వస్తుందని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని 15 రోజులు నుండి అధికారులతో రివ్యూలు, క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంకా భవిష్యత్తులో పెరగబోయి జనాభా దృష్టిలో పెట్టుకుని ఇంకో పది యం. యల్.డి కెపాసిటీ పెంచుటకు అంచనాల సిద్ధం చేయమని అధికారులకు ఆదేశించామన్నారు. దురదృష్టవశాత్తు 2014 -19 జగన్ పాలన వలన మరో 20 సంవత్స రాలు వెనక్కి వెళ్లిందన్నారు. మరల గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చూస్తామని రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు అన్నారు.