లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)బుధవారం తణుకు తాహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డ్ రూమును పరిశీలించి రికార్డు భద్రతకు తగిన ముందస్తు చర్యలను తీసుకోవాలన్నారు. సంవత్సరాల వారీగా, కేటగిరీల వారీగా ఫైల్స్ ను భద్రపరచాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సుమోటాగా జారీ చేస్తున్నా కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన డేటాను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి తగిన డేటాను సిద్ధం చేసుకున్న తర్వాతే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఖశ్చితమైన కుల ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుదారులకు సకాలంలో అందజేయాలన్నారు. గ్రామ, వార్డు రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వారిది ఏ కులమో, ఏ మతమో తెలుసుకొని సుమోటోగా కుల ధ్రువీకరణ పత్రం జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తణుకు మండలంలో 6,520 కుటుంబాలకు కుల దృవీకరణ పత్రాలు జారీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 6,283 కుల దృవీకరణ పత్రాలు జారీకి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.ఈ తనిఖీ సందర్భంలో తణుకు తాసిల్దార్ డి వి ఎస్ ఎస్ అశోక్ వర్మ, కార్యాలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
సుమోటో కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో క్షుణ్ణంగా పరిశీలన చేయాలి – జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
28
Aug