లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు అరికట్టాలని, మహిళా హక్కులు తెలుసుకోవడం కోసం ప్రజాశక్తి స్పెషల్ పత్రిక ద్వారా మహిళలకు అందించడం చాలా అభినందనీయం అని CITU జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ అన్నారు. గురువారం స్థానిక తణుకు పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్, బాయ్స్ స్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, నర్సింగ్ స్కూల్, అంగన్వాడీ సెక్టార్ వద్ద ప్రజాశక్తి స్పెషల్ పత్రిక CITU ఆధ్వర్యంలో పంపిణి చేశారు . ఈ సందర్బంగా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ అరుణ, బాయ్స్ స్కూల్ HM పద్మావతి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ… ప్రజా శక్తి పేపర్ మహిళలు నేడు ఎదుర్కొంటున్న సమస్యలు స్పెషల్ ఎడిషన్ ద్వారా మహిళలకు తెలియజేయడం పట్ల అభినందనలు తెలిపారు. CITU జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ మాట్లాడుతూ… మహిళా నేడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పోరాటాలు ద్వారా వచ్చిన హక్కులు, చట్టాలు కూడా నిద్రావ్యవస్థలో ఉన్నాయని విమర్శించారు. మహిళాలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని అన్నారు. ప్రజా శక్తి ప్రచురించిన స్పెషల్ లో మహిళాలోకం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఉన్నాయని తెలిపారు. మహిళలు సమస్యలు పరిష్కారం కోసం CITU పనిచేస్తునదని అన్నారు.
మహిళలపై జరుగుతున్న దాడులుపై ప్రజాశక్తీ స్పెషల్ ద్వారా మహిళలకు తెలియజేయడం అభినందనీయం – CITU జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్…
29
Aug