స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం…

లీడర్ భాస్కర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలను వెలికితీయటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఏపీ నిట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ వి.సందీప్ తెలిపారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసిటీఈ), విద్యా మంత్రిత్వ శాఖ (కేంద్ర ప్రభుత్వం) సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 పై శుక్రవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆచార్యులు శ్రీ ఫణీకృష్ణ కర్రి కోఆర్డినేటర్ గాను, డాక్టర్ వి.సందీప్, డాక్టర్ పి.శంకర్ మెంటర్ గా వ్యహహరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అంకుర పరిశ్రమలను ఏర్పాటుచేసి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకురావాలన్నారు. సెప్టెంబర్ 9న నిర్వహించే ఇంటర్నల్ కాంపిటేషన్ కార్యక్రమానికి 30 టీమ్ లు వరకు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాలున్నాయని చెప్పారు. నవంబరులో కేంద్ర ప్రభుత్వం గ్రాండ్ ఫైనల్ కార్యక్రమాన్ని నిర్వహంచి విజేతల వివరాలను ప్రకటిస్తుందని తెలిపారు.. విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ళపై వినూత్న పరిష్కారమార్గాల అన్వేషణకు కృషి చేయాల్సి ఉంటుందని, ప్రధమ స్థానంలో నిలిచిన వారికి రూ లక్ష, ద్వితీయ స్థానం సాధించిన టీమ్ కు రూ 50 వేలు చొప్పున నగదు బహుమతులను కేంద్ర ప్రభుత్వం అందజేయనుందని వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *