లీడర్ భాస్కర్ న్యూస్ (విశాఖపట్నం) బడిబాట కార్యక్రమంలో భాగంగా విశాఖలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి నారా లోకేష్ సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. పాఠశాలలో ఆటస్థలం అస్తవ్యస్తంగా ఉందని గుర్తించి, క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు . మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను మంత్రి లోకేష్ ఆరా తీశారు. పాఠశాలలో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను గమనించి, పాఠశాలలో తాగునీరు అందించడంతో పాటు మరుగుదొడ్లలో నీటి సరఫరా మెరుగుపర్చాలని ఆదేశించారు.
బడిబాటలో భాగంగా విశాఖలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన మంత్రి నారా లోకేష్ …
30
Aug