సుయల్స్ వేసే విధంగా చర్యలు చేపట్టాలి – తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…

లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు)ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా అనగానే ముందుగా గుర్తొచ్చేది వ్యవసాయం అని  జిల్లాలో వ్యవసాయ ఆధారితంగా అనేకమంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించడం జరుగుతుందని అన్నారు. అటువంటి పరిస్థితిలో జులై , ఆగష్టు , సెప్టెంబర్ మాసాలలో వచ్చే వరదల సమయంలో ఎక్కువ నష్టపోయేది రైతులే అని, ముఖ్యంగా యనమదుర్రు డ్రెయిన్ కారణంగా తణుకు నియోజకవర్గంలో అనేక గ్రామాలలో వరదల కారణంగా వేల ఎకరాల పంట పొలాలు నష్టం చూస్తున్నారని, వయ్యేరు – యనమదుర్రు డ్రెయిన్ కి సంబంధించి అనేక ప్రతిపాదనలు పెట్టడం జరిగిందన్నారు. తణుకు నియోజకవర్గంలోని కోనాల, ముద్దాపురం, దువ్వ , తిరుపతిపురం , వరిఘేడు గ్రామాలలో వరదల సమయంలో పంట నష్టం ఎక్కువగా ఉంటుందని దానికి సుయల్స్ వేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో సీజన్లలో రైతులు పంటను అమ్ముకోవడంకి నరకయాతన చూసేవారని అటువంటి పరిస్థితి పూర్తిగా మార్చి ధాన్యం రైతులు ఎక్కడ అమ్ముకోవాలి అనుకుంటే అక్కడ అమ్ముకునే విధంగా ఉండాలని, అస్త్యవ్యస్త విధానాన్ని మార్చాలని, మద్దతు ధర కల్పించే విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని దానికి అనుగుణంగా ప్రభుత్వం తరుపున చర్యలు చేపట్టాలని సంబంధిత మంత్రులను , అధికారులను కోరారు. అనంతరం అక్కడ నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికారులు ,శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *