* తణుకు నియోజవర్గంలో 15 కోట్ల 16 లక్షల రూపాయల సొమ్మును 36,618 మంది లబ్ధిదారులకు అందజేత -ఎమ్మెల్యే రాధాకృష్ణ
లీడర్ భాస్కర్ న్యూస్ :- పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం మండపాక గ్రామంలో ఉదయం 5.45 నిమిషాల నుండి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పింఛన్ల సొమ్మును ఆయన చేతుల మీదుగా స్వయంగా లబ్దిదారులకు పంపిణీ చేశారు.వృద్ధులు, వితంతువులకు 4000, ఇతర కేటగిరీల్లో 10 నుండి 15 వేలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ వెళ్ళదని తప్పుడు ప్రచారం చేశారని,ఉదయం 5.45 నిమిషాల నుంచి తొలిరోజే 96% పెన్షన్లు పూర్తి చేసేలా పనిచేస్తున్నామన్నారు.ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికి పెన్షన్ అందజేస్తామని MLA రాధాకృష్ణ హామీ ఇచ్చారు.తణుకు మండలం మండపాక, ఇరగవరం మండలం కావలిపురం, అత్తిలి మండలం పాలి గ్రామాల్లో అలాగే తణుకు పట్టణం 16వ వార్డులో స్వయంగా వెళ్లి పెన్షన్ సొమ్ము పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ లబ్దిదారులకు అందజేశారు. ఆయనతో పాటు కూటమి నాయకులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గోన్నారు.తణుకు నియోజవర్గంలో 15 కోట్ల 16 లక్షల రూపాయల సొమ్మును 36,618 మంది లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు.