లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలి ప్రమాణ స్వీకారం చేసి నేటికీ 30 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా తణుకు పురపాలక సంఘం నందు 225 మంది మున్సిపల్ వర్కర్స్ కి రాష్ట్ర వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో వారికి రెయిన్ కోట్స్ (దుస్తులు) పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న MLA ఆరిమిల్లి రాధాకృష్ణ మునిసిపల్ వర్కర్స్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సరళాదేవి మాట్లాడుతూ సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం పెట్టి 30 సంవత్సరాలు అయిన రోజున పురపాలక సంఘ వర్కర్స్ కి ఈ సేవ చేయడం చాలా చాలా సంతోషం గా ఉందన్నారు. ఊరిని శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికులే అసలైన నాయకులు అని,అందరి కంటే గొప్పవారని…. వారిని అందరూ గౌరవించాలన్నారు. అనంతరం MLA చేతుల మీదుగా దుస్తులు పంపిణీ ప్రారంభించారు. అనంతరం శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఐదు గురిని శాలువా కప్పి పూలదండలతో సత్కరించారు. ఈ సేవా కార్యక్రమం నిర్వహించిన వావిలాల సరళాదేవిని MLA రాధాకృష్ణ అభినందించారు..