లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు) విపత్కర పరిస్ధితుల్లో వరద బాధితులను ఆదుకోవడంలో ఉద్యోగుల స్పందన అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునే క్రమంలో ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ సేకరించిన 1,00,116 రూపాయల చెక్కును ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారికి అసోసియేషన్ నాయకులు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ విపత్కర పరిస్ధితుల్లో బాధితులను ఆదుకోవడంలో ఉద్యోగుల సహకారం అభినందనీయమన్నారు. ఈ విషయంలో ఉద్యోగుల స్పందన స్పూర్తిదాయకమని ఇదే స్పూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని ఆకాంక్షించారు.
విపత్కర పరిస్ధితుల్లో ఉద్యోగుల స్పందన అభినందనీయం…* జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
04
Sep