లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ)చివరి మైలు వరకు, వ్యక్తి వరకు ఆహారం అందించేందుకు కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో తెలియజేశారు.సురక్షిత తాగునీరు సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు.అంటువ్యాధుల ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటామని,పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ అత్యంత కీలకమన్నారు.బాధితులకు సాయమందించేందుకు స్ఫూర్తితో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించి, సాయం కోరుతామని చెప్పారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూ. కోటి విరాళం ప్రకటించారని, ఆయనకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.
వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది – సీఎం నారా చంద్రబాబు నాయుడు
04
Sep