లీడర్ భాస్కర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) ఎల్.అగ్రహారంలో ఇరవై ఏళ్ళ క్రితం సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో 360 కుటుంబాలు నివాసముండే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జీ ప్లస్ ఒన్ ఇందిరమ్మ ఇళ్లు పాలకుల, అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా శిధిలావస్థకు చేరుకుంటున్నాయని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు.గురువారం సీపీఐ బృందం ఇందిరమ్మ కాలనీలో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులు పరిశీలించారు.ఈ సందర్బంగా భీమారావు మాట్లాడుతూ కాలనీ నిర్మించి ఇరువై సంవత్సరాలకు పైగా గడుస్తున్నా కాలనీలో కనీసం త్రాగునీరు, విద్యుత్,రోడ్లు లాంటి కనీసావసరాలకు కూడా నోచుకోలేదన్నారు.360 ఇళ్ళల్లో ప్రస్తుతం 20 కుటుంబాలు మాత్రమే నివాసముంటున్నారన్నారు.వారు కూడా ఎలాంటి గూడు లేని నిరుపేదలు ఐదువందల రూపాయల అద్దె చెల్లిస్తూ కాలం గడుపుతున్నారన్నారు.పట్టాదారులెవరూ నివాసం వుండడం లేదన్నారు.అధికారుల తక్షణమే ఇందిరమ్మ కాలనీలో స్థితిగతులు పరిశీలించాలని కోరారు.కనీస మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసి నిలువ నీడ లేకుండా ఎక్కువ మొత్తం అద్దెలు ఇచ్చుకోలేక కాలనీలోనే నివాసముంటున్న నిరుపేదలకు వాటిని కేటాయించాలని భీమారావు కోరారు.సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.సీతారాం ప్రసాద్,పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, మేరీ,చింటాడ ఫ్రాన్సిస్, బి.రాంబాబు, ఆర్.సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం ఇందిరమ్మ కాలనీలో కనీస అవసరాలు సమకూర్చాలి – జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు..
05
Sep