లీడర్ భాస్కర్ న్యూస్( కొత్తపేట) ఆలమూరు మండలం చొప్పెల గ్రామ ఇటుక బట్టీ సంఘం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుని మర్యాదపూర్వకంగా కలిశారు.గత వైసీపీ ప్రభుత్వంలో తమ సమస్యలపై ఎన్నిసార్లు గోడు వినిపించినా పరిష్కార మార్గం చూపలేదని ఆవేదన వ్యక్తం చేసారు.కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతాదనే నమ్మకం ఉందని అందుకే సమస్యలను ఎమ్మెల్యే సత్యానందరావుకి విన్నవించామని బట్టీ సంఘం తెలిపింది.సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని తెలియజేశారు .అనంతరం ఎమ్మెల్యే సత్యానందరావుని శాలువా,పుష్పగుచ్ఛంతో బట్టీ సంఘం సత్కరించారు.
ఎమ్మెల్యే సత్యానందరావుని కలసిన చొప్పెల ఇటుక బట్టీ సంఘం…* సమస్యలు పరిష్కరించాలని వినతి…
06
Sep