బుడమేరు వరద, కట్ట పటిష్టానికి చర్యలు తీసుకున్నాం – మంత్రి లోకేష్

లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ)బుడమేరు వరద, కట్ట పటిష్టానికి తీసుకుంటున్న చర్యలపై డ్రోన్ లైవ్ ద్వారా కలెక్టరేట్ నుంచి సమీక్షించిన్నట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు. జియో మెంబ్రేన్ షీట్ల వినియోగం ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. గండ్లు పడినచోట ఎత్తు పెంచి కట్ట స్థాయికి పనులు పూర్తయ్యాయి.
వరద బాధితులను ఆదుకునేందుకు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, నియోజకవర్గ టీడీపీ నేతలు కలిసి రూ.34,47,442, హైదరాబాద్ కు చెందిన ప్రకాశ్ ఆర్ట్స్ ఛైర్మన్ సీడీవీ సుబ్బారావు రూ.25 లక్షలు, చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన డాలర్స్ దివాకర్ రెడ్డి రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన పీవీఎస్ లేబరేటరీస్ అధినేత పీవీ శేషయ్య రూ.10 లక్షలు, పెనమలూరుకు చెందిన ఎంవీఆర్ చౌదరి రూ.5 లక్షలు అందజేశారు. పెద్ద మనసుతో వరద బాధితులకు సాయం అందించినందుకు దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *