లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ)ఏపి సీడ్స్ CSR ఫండ్స్ నుంచి వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల చెక్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ఏపి సీడ్స్ ఎండీ శివప్రసాద్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ అందచేశారు.ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు తీరని నష్టం మిగిల్చాయని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, సంస్థలు అవకాశం మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సాయం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.