లీడర్ భాస్కర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) విజయవాడ వరద బాధితులకు తాడేపల్లిగూడెం 3f ఇండస్ట్రీ 5లక్షల చెక్కును ఆ సంస్థ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ జున్నూరు జనార్థన్ ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ కి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ వరదబాదితులకు ఆపన్నహస్తం అందించిన 3f ఇండస్ట్రీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. వరద బాధితులకు 3f యాజమాన్యం తరపున ఇటీవల ఆహారం పంపిణీ నిర్వహించిన 3f ఇండస్ట్రీ ప్రస్తుతం మరో 5లక్షలు సీఎం సహాయనిధికి అందించడంపై అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా 3f అధినేత ఓపీ గొయంక వారి సహాయ సహకారాలతో వరద బాధితులకు ఐదు లక్షలు చెక్కు అందజేశామని హెచ్ఆర్ జనరల్ మేనేజర్ జున్నూరు జనార్ధన్ అన్నారు. ఇదే తరహాలో రాబోయే రోజుల్లో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడమతామని జనార్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనార్థన్ తో పాటుగా జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, 3f ఫంక్షనల్ ఇంచార్జ్ వేమల శ్రీనివాసు, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు.
విజయవాడ వరద బాధితులకు 3f ఇండస్ట్రీ వారి ఆర్థిక సహాయం…
11
Sep