కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ సీఎం వైయస్‌ జగన్‌ పర్యటన… * ఏలేరు వరద ఉధృతితో అతలాకుతలమైన గ్రామాల సందర్శన….

లీడర్ భాస్కర్ న్యూస్ (కాకినాడ) పిఠాపురంలో మాజీ సీఎం వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ పర్యటించారు. ఏలేరు వరద ఉధృతితో అతలాకుతలమైన గ్రామాలను ఆయన సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏలేరు రిజర్వాయర్‌ దగ్గర పరిస్థితి చూస్తే, విజయవాడ గుర్తుకొస్తోందని,ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ చేయలేదని తుపాన్‌పై ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు, కనీసం రివ్యూ నిర్వహించలేదన్నారు. కలెక్టర్లతో మాట్లాడలేదని, ప్రత్యేక అధికారులను జిల్లాలకు పంపించాలని కానీ ఆ పని చంద్రబాబు చేయలేదని, సీయస్ కూడా ఏ మాత్రం పట్టించుకోలేదని, అన్నీ గాలికోదిలేశారన్నారు.ఇప్పుడే కనుక జగన్‌ ప్రభుత్వం ఉండి ఉంటే.. రైతులకు పెట్టుబడి సాయం అంది ఉండేది. సీజన్‌ ప్రారంభంతోనే సాయం చేసి ఉండేవాళ్లం.గతంలో పంట నష్టం జరిగితే హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చాం. గతంలో చంద్రబాబు హయాంలో అది కేవలం రూ.15 వేలు మాత్రమే అని తెలియజేశారు. ప్రీమియమ్‌ కట్టి ఉండే వాళ్లం కాబట్టి రూ.24 వేల నుంచి రూ.25 వేల వరకు బీమా పరిహారం వచ్చేది.దాంతో పాటు, పెట్టుబడి సాయం, సున్నా వడ్డీ కింద దాదాపు రూ.5 వేల వరకు.. అన్నీ కలిపి రైతులకు ప్రతి ఎకరాకు దాదాపు రూ.45 వేల వరకు సాయం అంది ఉండేదన్నారు.కానీ, ఈ పెద్ద మనిషి ఏం చెబుతున్నాడు. ఎకరాకు రూ.10 వేలు ఇస్తానన్నాడన్నారని, కానీ ఎలా? ఈ–క్రాపింగ్‌ లేదు. ఆర్బీకేలు లేవు. వ్యవస్థ లేదన్నారు.ఇంకా ఇన్సూరెన్స్‌ గురించి చెప్పడం లేదు. భరోసా గురించి మాట్లాడడు. ఇన్ని విధాలుగా రైతులు నష్టపోతున్నా, చంద్రబాబు మాట్లాడడు అని విమర్శలు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *