విరాళాలు ఇచ్చే దాతల దాతృత్వానికి కృతజ్ఞతలు – తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తణుకు నియోజకవర్గంలో పలు గ్రామాల దాతల నుండి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విరాళాలు అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వారు వంతు సహాయంగా ఆర్థిక సహకారాన్ని అందించడం అభినందనీయమన్నారు. అలాగే మన తణుకు నియోజకవర్గం నుంచి మరింత మంది దాతలు ముందుకు వచ్చి విరివిగా వరద బాధితులకు సహాయార్థం విరాళాల ఇవ్వడం చాలా సంతోషమని తెలియజేశారు.ఇటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవడం చాలా అవసరం ఉందని తెలియజేశారు.చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కు విరాళాలు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా శనివారం నియోజకవర్గంలో పలు సంస్థలు గ్రామాల దాతల నుండి దాదాపు5 లక్షల 44 వేల 116 రూపాయలు అందజేశారు.ఈ సందర్భంగా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *