లీడర్ భాస్కర్ న్యూస్ (కాకినాడ) పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామం, మాయపట్నం గ్రామాలలో వరద బాధితులకు తణుకు నియోజకవర్గ జనసేనపార్టీ తరఫున ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కాట్నం విశాలి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు,దుప్పట్లు,బట్టలు,బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు. తమ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేవాగుణంతో తామంతా పనిచేస్తామన్నారు.
వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణి చేసిన జనసేన నాయకురాలు కాట్నం విశాలి…
15
Sep