లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) విజయవాడ వరద బాధితులకు తమ వంతుగా తణుకు బెల్ వెదర్ స్కూల్ విద్యార్థులు, యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2,00,000/- రూపాయల విరాళాన్ని చెక్ రూపంలో తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణకి పార్టీ క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్బంగా MLA రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు వారి పోకెట్ మని విరాళంగా అందించడం అనేది వారి వయసుకు మించిన ఆలోచన అని, చిన్న వయసు లో పెద్ద మనసుతో ఆలోచించడం అభినందనీయం అన్నారు. ఎన్నడూ లేని విధంగా విజయవాడ కు పెద్ద ఎత్తున వరదలు సంభవించాయని ఇటువంటి విపత్కర పరిస్థితి లో ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారని ప్రభుత్వంతో పాటు సామాన్య ప్రజలు కూడా ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా సహాయం అందించి బాధితులకు అండగా నిలబడ్డారని అన్నారు. ఇటువంటి విపత్తుల సమయంలో సహృదయంతో విరాళాలు అందించిన దాతలందరికీ ఎమ్మెల్యే రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు .
వరద బాధితులకు బెల్ వెదర్ స్కూల్ విద్యర్థులు 2లక్షలు విరాళం…
25
Sep