ప్రజల సహకారంతో ఆసుపత్రుల అభివృద్ధి చేద్దాం – పెంటపాడు పిఎసి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి…

లీడర్ భాస్కర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) ప్రజలంతా సహకారం అందిస్తే ఆసుపత్రులు సుందరంగా తీర్చిదిద్దవచ్చని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాభివృద్ధి కమిటీ సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్యులు నూరు శాతం వైద్య సహాయం అందించాలని అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది అన్నారు. దాతలు కూడా ముందుకు వచ్చి ఆసుపత్రులకు కావలసిన సదుపాయాలు కల్పించడం ద్వారా ఆస్పత్రులను సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చు అన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఎప్పుడు పెద్దపీట వేస్తుందన్నారు. వైద్యులు పీహెచ్సీ కి వచ్చిన ప్రతి ఒక్కరిని నూరు శాతం ఆ బాధ తగ్గేవరకు వైద్య సేవలు అందించాలని తప్పని పరిస్థితుల్లో తప్ప వేరే చోటకి పంపించకూడదని సూచించారు. రోగులు కూడా వైద్యులపై దురుసుగా ప్రవర్తించకూడదని ప్రజలు వైద్యుల పట్ల స్నేహభావం ఉంటే ఎలాంటి భయం లేకుండా సాఫీగా వైద్య సేవలు అందించగలుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం ఎంపీపీ దాసరి హైమవతి, మండల వైద్యులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *