లీడర్ న్యూస్ (పెరవలి)తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి లోని రవళి స్పిన్నర్స్ ప్రాంగణంలో అక్టోబర్ 12వ తేదీ శనివారం విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రవళి స్పిన్నర్స్ , ఇండియన్ హేయిర్ ఇండస్ట్రీస్ అధినేత శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు సిబ్బంది ఏర్పాటుచేసిన విజయదశమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిలాలి చూడాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని వేడుకుంటున్నాను అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. దుష్ట సంహారం తర్వాత శాంతి,సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి జీవించాలన్నదే దసరా పండుగ సందేశం అన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దాం. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగ దినాల్లో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం.అందరికి మనస్ఫూర్తిగా దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రకృతి వైపరేత్యాలను సమర్థవంతంగా ఇదుర్కునే శక్తి కనక దుర్గా దేవి ప్రజలకు అందజేయాలని ఆయన అన్నారు.పరిశ్రమలలో కూడా ఈ మధ్య రాష్ట్రంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, కార్మికులు కూడా శ్రద్ధగా యంత్రాల పనితీరు చూసుకోవాలని తెలిపారు. నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులోకి రావాలని , రైతులకు మేలు జరిగేలా విజయదశమి కొనసాగాలని రవీంద్రనాథ్ తెలిపారు . ఈ కార్యక్రమంలో రవళి స్పిన్నర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంక రాజకుమారి రవళి స్పిన్నర్స్ డైరెక్టర్ రవళి, సీఈఓ వికాస్ , మానవ వనురుల అధికారి వీరస్వామి, సాంకేతిక అభివృద్ధి ఆదికారి రాజశేఖర్ బిర్ద్వాజ్, కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రవళి స్పిన్నర్స్ లో విజయదశమి వేడుకలు… *దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్…
12
Oct