లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) యువకుల్లో సామాజిక బాధ్యత కలిగి ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సూచించారు. నిన్న తణుకు షుగర్ ప్యాక్టరీ ఎదురుగా కాలువలోకి ప్రమాదపు శాత్తు కారు దూసుకుపోయిన సంఘటనలో తండ్రి, కూతురుని కాపాడిన సాయిబాబు అనే యువకుడి సాహసానికి MLA రాధాకృష్ణ ఈరోజు ఆయన కార్యాలయంలో శాలువా కప్పి, మెమోంటో, 10,000/- నగదు అందజేసి ఆయన అభినందనలు తెలియజేశారు.కారు ఘటనలో బయటపడ్డ దాసరి రాంబాబు, ఆయన కుమార్తె మౌనికలు తమని ప్రాణాలు కాపాడిన యువకుడు సాయిబాబాని పట్టుకొని బావోద్వేగానికి గురైయ్యారు. అనంతరం సాయిబాబుని తండ్రి,కూతురు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం సాయిబాబు మాట్లాడుతూ తన కంటి ముందు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని చూసి చలించిపోయానని, తనకి ఈత కూడా రాదు అని, కాపాడాలి అన్న లక్ష్యంతో కాలువలోకి దూకి కాపాడాను అని తెలియజేశారు. కుటుంబానికి పెద్ద దిక్కులా ఉండే తల్లి, దండ్రులు లేకపోతే ఆ బాధ తనకు తెలుసునని, తన కుటుంబంతో గుడికి వెళ్తున్న సమయంలో కారు మునిగి పోవడం చూసి తెగించానని తెలియజేశారు..
ప్రాణాలు కాపాడిన యువకుడికి ఘన సన్మానం నిర్వహించిన తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…
13
Oct