లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టిందని తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని.. వ్యవస్థలను ధ్వంసం చేసి పరిపాలన అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైకాపా సర్కారు చిన్నాభిన్నం చేసిందన్నారు. గత వైకాపా సర్కారు రూ.1.35 లక్షల కోట్ల మేర బకాయిలు పెట్టి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ఈ మేరకు బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై రాధాకృష్ణ మాట్లాడారు.”సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని,ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే రెండు ప్రధాన హామీలు అమలు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని,ఉచిత గ్యాస్ హామీ అమలులో భాగంగా రూ.840 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు.మరో రెండు పథకాల అమలు కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైస్సార్సీపీ చిన్నాభిన్నం చేసింది – MLA ఆరిమిల్లి రాధాకృష్ణ
11
Nov