ఇరిగేషన్ కి సంబందించి పలు సమస్యల పరిష్కారంపై మంత్రి నిమ్మలని కోరిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)వెలగపూడిలోని రాష్ట్ర సచివాయలయం నందు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ కలిసి తణుకు నియోజవర్గంలోని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పలు ఇరిగేషన్ కి సంబంధించి ప్రతిపాదనలు ఇచ్చి సమస్యలు పరిష్కరించమని కోరారు.ఈ సంధర్భంగా తణుకు నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన సత్యవాడ మీడియం డ్రైయిన్ (మండపాక మడుగు పోర్షన్ ) కు సంబంధించి రూ. 9.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయుట, వేల్పూరు – తణుకు రోడ్డులో వెంకట్రాయపురం వద్ద G&V కెనాల్ కి 4.00 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు కొరకు, ఇరగవరం మండలం కె ఇల్లిందలపర్రు, కన్నాయి కుముదవల్లి, పేకేరు, ఇరగవరం గ్రామాలలోని 2.21 కోట్లతో రిటైనింగ్ వాల్స్ , బాక్స్ ఇంలెట్ లను నిర్మాణం చేయుట మరియు తణుకు మండలం వేల్పూరు గ్రామంలో గోస్తని కాలువ ప్రధాన డ్రైయిన్ కు 9.40 కోట్ల రూపాయల వ్యయంతో రెటైనింగ్ వాల్ నిర్మాణం చేయుట గురించి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని ఎం‌ఎల్‌ఏ రాధాకృష్ణ కలిసి నియోజకవర్గంలోని సమస్యలు గురించి వివరించి ప్రతిపాదనలు అందించారు. ఈ సంధర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *