లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉందని వైకాపా రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైకాపా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేయాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగిందన్నారు.అందులో భాగంగా 13వ తేదీన రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. 27న విద్యుత్ బిల్లులపై, వచ్చే నెల జనవరి 3 న ఫీజు రీయంబర్స్మెంట్ కోసం పోరాటం చేయనున్నట్లు తెలియజేశారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం – ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
11
Dec