లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)తణుకు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద ప్రజలకు గంజాయికి వ్యతిరేఖంగా అవగాహన కల్పించడం జరిగింది.ఇందులో భాగంగా ప్రజలకు గంజాయి సేవించడం వలన కలిగే అనర్థాలు వివరిస్తూ వాటి వలన ప్రజల ఆరోగ్యానికి సమాజానికి కలిగే నష్టాలు వివరించారు.గంజాయి డ్రగ్స్ వ్యసనం ఏ విధంగా అలవడుతుంది,వాటి నుండి బయట పడాలంటే ఏమి చేయాలి, ఏ రకముల చికిత్సలు ఉన్నాయి, గంజాయి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తీసుకొచ్చిన చట్టాలు తదితర అంశంపై ప్రజలకు అవగాహన కలిగించడంతోపాటు వారి యొక్క సందేహాలను నివృత్తి చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం గంజాయి మరియు డ్రగ్స్ రహిత తణుకు దిశగా ప్రజల నుండి ప్రతిజ్ఞ తీసుకోవడంతో ముగిసింది.
ఈ సందర్భంగా తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుర్వ్యసనాలకు గురికాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను అన్ని ప్రధాన ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.