లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి) ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికే “జనవాణి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గోదావరి జిల్లాల రీజనల్ కోర్డినేటర్ కాట్నం విశాలి తెలిపారు. ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల నుండి జనవాణి కార్యక్రమం ద్వారా సమస్యలు తెలుసుకొని ఆయా శాఖల వారికి సమస్యలతో కూడిన వినతి పత్రాలు పంపి పరిష్కారం కోరే వారని, ఆ కార్యక్రమానికి వచ్చిన అపూర్వ స్పందన చూసి, అధికారం చేపట్టిన తర్వాత కూడా “జనవాణి” కొనసాగింపు చేయాలన్న నిర్ణయంతో నేటికీ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు & పార్టీ నాయకులు ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే “జనవాణి” – కాట్నం విశాలి
18
Dec