అమిత్ షా ను కేంద్ర మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి -సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్…

లీడర్ భాస్కర్ న్యూస్ (ఉండి)భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానపరుస్తూ పార్లమెంటులో అనుచితంగా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కేంద్ర మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.అమిత్ షా అంబేద్కర్ ను అవమానపరుస్తూ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ శుక్రవారం ఉండిలో సీపీఐ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉండిలో అంబేద్కర్ విగ్రహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగంపై పార్లమెంటులో జరుగుతున్న చర్చలో అంబేద్కర్ పేరును కాంగ్రెస్ నాయకులు పదే పదే జపించడం కన్నా భగవంతుని స్మరించి వుంటే స్వర్గం ప్రాప్తించి వుండేదని మాట్లాడి అంబేద్కర్ ను తీవ్రంగా అవమానపరచిన అమిత్ షా కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు.భారత రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి ఏ మాత్రం గౌరవం వున్నా తక్షణమే అమిత్ షా ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని భీమారావు డిమాండ్ చేశారు.దేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించి దేశానికి దశా దిశా నిర్దేశించిన అంబేద్కర్ పట్ల అమిత్ షా వ్యాఖ్యలు బిజెపి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిందన్నారు.అమిత్ షా వ్యాఖ్యలు దేశ ప్రజలు మనోభావాలకు భంగం కలిగించిందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *