లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం) ఆమె కవితలు ఓ గొప్ప కళాఖండం… ఆమె కవితలు ఓ మధుర కావ్యం… ఆమె కవితలు ఒక నిజ జీవితం… ఇలా తన కలం నుండి జాలువారే ప్రతీ కవిత ఒక అపూర్వ రూపమే…!
సోషల్ మీడియా ద్వారా తన భావజాలన్ని నిత్యం వ్యక్త పరుస్తూ, లక్షలాది మందిలో తన కవితల ద్వారా చైతన్యం కలిగిస్తూ…ఎంతో మందికి స్ఫూర్తిని అందిస్తున్న భీమవరానికి చెందిన కవయిత్రి నీరజ చంద్రన్ రూపొందించిన “నీరాజనం” కవితలతో కూడిన పుస్తకాన్ని సోమవారం నాడు తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధిలో ఆమె తల్లి, తండ్రులు, కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నీరజా చంద్రన్ కి సోషల్ మీడియాలో తన స్నేహితులు నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.