భీమవరంలో సిపిఐ నూరు వసంతాల పండుగ…

లీడర్ న్యూస్ (భీమవరం) డిసెంబరు 26
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వేచ్చా, స్వాతంత్ర్యాల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఘన చరిత్ర సిపిఐ కే దక్కిందని పార్టీ ఆవిర్భావం మొదలు నేటి వరకు అంటరానితనం, సమాన హక్కులు, సమసమాజం నిర్మాణం, మత సామరస్యం కోసం సిపిఐ అవిశ్రాంతంగా పోరాడింది సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. సిపిఐ నూరు వసంతాల పండుగను పురస్కరించుకుని భీమవరంలో గురువారం ప్రజా ప్రదర్శన భారి బహిరంగ సభ నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోనాల మాట్లాడుతూ రష్యా విప్లవం స్పూర్తితో 1925 డిసెంబరు 26న కాన్పూరులో సిపిఐ ఆవిర్భవించిందని సంపూర్ణ స్వాతంత్రం లక్ష్యంగా ఉద్యమించిందనని, వేలాది మంది కమ్యూనిస్టులు జైళ్లు పాలయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మందికి పైగా అసువులు బాశారని, పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన భూ పోరాటం పద్దెనిమిది మంది చనిపోయారని, భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ముందుకెళ్లాలన్నారు‌.పాలకుల అవినీతితో స్వాతంత్ర్య ఫలాలు అట్టడుగుకు చేరడం లేదని, నల్ల సాగు చట్టాలు, నాలుగు లేబర్ కోడ్లు, రైతులు కార్మికులను రోడ్డన పడేస్తున్నాయని మరో పోరాటం చేయాల్సిందేనని ఆయన సూచించారు. తొలుత పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను కోనాల ఆవిష్కరించారు. పట్టణ వీధుల్లో ప్రజా ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *