– అటవీ శాఖ ఉన్నతాధికారులకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు…
లీడర్ న్యూస్ (మంగళగిరి)కాకినాడ బీచ్ రోడ్, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆలివ్ రిడ్లీ తాబేళ్ళ మరణానికి కారణాలు విచారించి, దీనికి కారణం అవుతున్న వారిపై చర్యలు చేపట్టాలని, వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ & హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ చిరంజీవి చౌదిరిని ఆదేశించారు.