లెహ్యం పుడ్ ప్రొడక్ట్ ఆపాల్సిందే…లేదంటే ప్రజలంతా ఏకమై ఉద్యమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు – మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు

లీడర్ న్యూస్ (తణుకు) లెహ్యం పుడ్ ప్రొడక్ట్ (పశువధ) పరిశ్రమకు నా హయాంలోనే పర్మిషన్లు ఇచ్చి ఉంటె ఆ ఐదు సంవత్సరాల్లో ఒక్క పశువు కూడా ఎందుకు వధ జరగలేదని తణుకులో ysrcp కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు ప్రశ్నించారు. ఈ రెండు నెలల నుండే ఎందుకు రోజూ వందలు వందలు పశువులు గోవులు వదిస్తున్నారన్నారు.గత ఐదేళ్లు పశువధ ఫ్యాక్టరీ ఒక్క రోజు కూడా నడవలేదని  హమాలీ జట్టు కూలీలు నేరుగా తెలియజేసారన్నారు.రెండు నెలలుగా తాము అక్కడ పని చేయలేక పోతున్నామని వాసనతో తిండి తినలేక పోతున్నామని కార్మికులు ఆవేదన మీకు ఎందుకు అర్ధం కావడం లేదన్నారు.పేపర్స్ లో 34 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఉన్నట్లు తప్పుడు పత్రాలు చూపిస్తున్నారని,కాని ఫ్యాక్టరీ 3ఎకరాల 29 సెంట్లులో మాత్రమే జనావాసాల మధ్య ఉంది ఈఒక్క కారణం చాలు అది మూయించటానికి అన్నారు.ప్రజలంతా ఏకమై ఉద్యమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారని,అనుమతులు లేని ఫ్యాక్టరీకి పోలీస్ లు ఎలా కాపలా కాస్తారు అని మండిపడ్డారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *