లీడర్ న్యూస్ (తణుకు)తణుకు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు 34 వార్డులలో చెత్తను సేకరించడానికి పుష్ కట్స్ (పారిశుద్ధ్య బండ్లులను) ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు పట్టణంలో 34 వార్డులలో చెత్త సేకరణకు సంబంధించి మార్పులు తీసుకొచ్చి సక్రమంగా ప్రతీ ఇంటి వద్ద నుండి చెత్తను సహకరించే విధంగా దాదాపు 35 పుష్ కాట్స్ ని ప్రారంభించడం జరిగిందన్నారు.
ఈ 35 పుష్ కార్డ్స్ ద్వారా సిబ్బంది ఆయా వార్డులో ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి చెత్తని సేకరించి ఒక పాయింట్ లో పెట్టి ఆ పాయింట్ నుంచి డంపింగ్ యార్డ్ తరలిస్తారని అన్నారు.చెత్త సేకరణ ద్వారా పారిశుధ్యం చేసే విధంగా ఈ యొక్క పుష్ కార్డ్స్ ద్వారా చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు పంపించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.
ప్రతి సంవత్సరం చెత్త సేకరణకు ఆటోల ద్వారా కోటి 70 లక్షలు ఖర్చు పెడుతున్నారని దానిలో సగభాగంతో ఈ యొక్క పుష్ కార్డ్స్ తో ఈ యొక్క పారిశుద్ధ్యన్ని పెంపొందించుకోవడం జరుగుతుందని అన్నారు.దీనిలో భాగంగా ఇంకొక 14 మందిని అదనంగా పారిశుద్ధ కార్మికులను తీసుకోవడం కూడా జరిగిందన్నారు.
మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు సుమారు రెండు లక్షలతో మగవారికి ఆడవారికి బట్టలు పంపిణీ చేశామని తణుకు మున్సిపాలిటీకి సంబంధించి పుష్ కార్డులకు సుమారు పది లక్షల వ్యయం అయిందన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,మున్సిపల్ అధికారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.