లీడర్ న్యూస్ (భీమవరం) భారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఐనంపూడి శ్రీదేవి ఎంపికైయ్యారు.జిల్లాలో అత్తిలి మండలం కంచుమర్రు వాస్తవ్యులైన కొత్తపల్లి రామరాజు, రంగమ్మ దంపతులకు కుమార్తెగా ఐనంపూడి శ్రీదేవి 1975 డిసెంబర్ 12వ తేదీన జన్మించారు. తండ్రి వ్యవసాయం చేసేవారు. తల్లి గృహిణి. శ్రీదేవి పదవ తరగతి చదువుతుండగా వివాహం జరిగింది. వివాహానంతరం ఇంటర్ డిగ్రీ ప్రైవేట్ గా పూర్తి చేసినారు. చిన్నతనం నుండి ఇతరులకు సాయపడాలనే ఆకాంక్ష, సోషల్ సర్వీస్ నందు ఇష్టంతో జాతీయ నాయకుల, ప్రముఖుల పుస్తకాలు ,కథల పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. అలాగే చిన్నతనం నుండి దేవుని పూజలు, సేవలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. వివాహం అనంతరం భర్త ఐనంపూడి రామరాజు వ్యాపార రీత్యా శ్రీదేవి కుటుంబం 15 సంవత్సరాలు ఫోటోగ్రఫీ వ్యాపార రంగంలో విదేశంలో (దుబాయ్ ) స్థిరపడ్డారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు ఐనంపూడి హరీష్ వర్మ,బీటెక్ పూర్తి చేశారు. కుమార్తె ఐనంపూడి అశ్విని,ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసి ప్రస్తుతం పీజీ చేస్తున్నారు. 2010 సంవత్సరంలో తిరిగి స్వదేశానికి వచ్చి ఫోటోగ్రఫీ వ్యాపారంగంలో( బాబా డిజిటల్ ల్యాబ్) లేటెస్ట్ టెక్నాలజీని పరిచయం చేస్తూ బాబా మేడంగా అందరికీ సుపరిచితులుగా పేరుగాంచారు. 2012వ సంవత్సరంలో అప్పటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ , పైడికొండల మాణిక్యాలరావు , కోడూరి లక్ష్మీనారాయణ , టీవీఎస్ వర్మ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరి అనేక పదవులు అలంకరించి అందరి మన్ననలు పొందారు. సేవా రంగంలో 2020 సం,,తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షురాలుగా, వ్యాపార రంగంలో 2018సం,, తణుకు ఏరియా ఫోటో స్టూడియో సంఘ అధ్యక్షురాలుగా, రాజకీయ రంగంలో భారతీయ జనతా పార్టీలో పలు పదవులను చేపట్టారు.అందరినీ కలుపుకుంటూ సీనియర్ నాయకులు పాకా వెంకట సత్యనారాయణ , నార్ని తాతాజీ , జిల్లా పెద్దలు, సీనియర్ నాయకుల ప్రోత్సాహంతో వారి అడుగుజాడల్లో నడుస్తూ అంచలంచెలుగా పదవులను అలంకరించారు.2025 సం,, నేడు నూతనంగా బారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు గా ఎన్నిక అయ్యారు.2023సం,, భారతీయ జనతా పార్టీ తణుకు నియోజవర్గ కన్వీనర్ గా, 2021సం,,మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలుగా, 2015 సం,,మహిళా మోర్చా రాష్ట్ర సెక్రటరీగా, 2013 సం,,బేటి బచావో, భేటీ పడావో రాష్ట్ర కన్వీనర్ గా, 2012సం,,మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు చేపట్టి పార్టీలో అజాతశత్రువుగా పేరుగాంచి భారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా శ్రీమతి ఐనంపూడి శ్రీదేవి గారు ఎన్నిక కావడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా ఐనం శ్రీదేవి…
22
Jan