లీడర్ న్యూస్ (ఉండి) ఉండి మండలం కలిగొట్ల గ్రామం రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 56 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో 150 మంది నిరుపేదలకు 200 రూపాయల చొప్పున ప్రతినెల ఇవ్వడంతో పాటు కొంతమంది మహిళలకు రెండు నెలలు ట్రైనింగ్ నేర్పి వారికి మిషన్ అందజేయడం అభినందనీయమన్నారు. ప్రతీ ఒక్కరూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్బంగా రాజ్ ట్రస్ట్ అధినేత గంటా రాజ్ కుమార్ ని ఎమ్మెల్యే RRR అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
రాజ్ ట్రస్ట్ సేవలు అభినందనీయం – ఏపీ డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యే కనుమూరి రఘు రామకృష్ణం రాజు…
14
Feb