లీడర్ న్యూస్ (తణుకు) తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాచ్య పరిశోధనాసంస్థ లో భాగమైన తెలుగు అధ్యయనా శాఖ మరియు తెలుగు సంఘం బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడవ అంతర్జాతీయ తెలుగు భాషా ఉత్సవాలు ఈనెల 27, 28 తేదీలలో తిరుపతి శ్రీనివాస ఆడిటోరియంలో జరగనున్నాయి. ఈ సభలో ఆధునిక కవిత్వం – భాషా ప్రయోగాలు అంశంపై పత్ర సమర్పణ చేసి ప్రసంగించవలసిందిగా తణుకుకు చెందిన కవి సాహిత్య రిషికి ఆహ్వానం అందినట్లు రిషి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రిషిని అభినందించారు.
అంతర్జాతీయ తెలుగు భాషోత్సవాలకు తణుకు రిషికి ఆహ్వానం…
19
Feb