లీడర్ న్యూస్ (తణుకు)తణుకు పట్టణ పరిధిలోని బైక్ దొంగతనాలు, చోరీలు నివారించడానికి ప్రజలతోపాటు వ్యాపారస్తులు సహకరించాలని తణుకు పట్టణ సీఐ ఎన్.కొండయ్య కోరారు. పట్టణంలోని ప్రతీ షాపు ముందు ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సోమవారం రాత్రి రాష్ట్రపతి రోడ్డులోని నాకాబందీ నిర్వహించి షాపు యజమానులకు అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు రోడ్డువైపునకు సీసీ కెమెరాలు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ కొండయ్య వెంట ట్రాఫిక్ ఎస్సై డి.ఆదినారాయణ, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి షాపు ముందు సీసీ కెమెరా తప్పనిసరి…తణుకు పట్టణ సీఐ కొండయ్య సూచనలు…
25
Feb