ప్రభుత్వ మార్పు ప్రజా పథకాలపై, ప్రభుత్వం నిర్మాణాలపై పడకూడదు – MLC వంక రవీంద్రనాధ్

లీడర్ న్యూస్ (విజయవాడ) ప్రభుత్వ మార్పు ప్రజా పథకాలపై, ప్రభుత్వం నిర్మాణాలపై పడకూడదని, అవి నిరంతరంగా కొనసాగడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని శాసన మండలి సభ్యులు వంక రవీంద్ర నాథ్ అన్నారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఈరోజు తన ప్రసంగంలో వైద్యానికి బడ్జెట్ లో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 0.3% ఎక్కువ కేటాయింపులు చేసినప్పటికీ, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఇవ్వవలసిన నిధులు గత సంవత్సరం నుండి బాకీలు ఉన్నాయని, ఉదాహరణగా తణుకు ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న డైయాలిసిస్ సెంటర్ కు 1.23Cr గత 8 నెలలుగా చెల్లించవలసి ఉందన్నారు.ఇలా బాకీలు ఉంటే ప్రజలకు వైద్య సౌకర్యాలు చేయడానికి ప్రైవేట్ సంస్థలు ముందుకు రావని , తద్వారా పేదలకు అందవలసిన ప్రయోజనాలు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *